పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పోలవరం పనుల్లో అంతరాయం ఏర్పడింది. డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అమ్మోనియం నైట్రేట్ కొరత కారణంగా బ్లాస్టింగ్‌ పనులు సుమారు 30% తగ్గినట్లు అధికారులు తెలిపారు.

అయితే సమాంతర డయాఫ్రమ్ వాల్ పనులు మాత్రం నిర్ణీత గడువులో పూర్తి అవుతున్నాయని, మార్చి నెలాఖరు నాటికి పనులు ముగుస్తాయని అధికారులు వెల్లడించారు.