
ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో హానికర రసాయనాలతో ఐస్‌క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్లపై గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మెహిదీపట్నం, అహ్మద్‌నగర్, బడాబజార్, ఫస్ట్‌లాన్సర్ ప్రాంతాల్లో ఆలియా ఐస్‌క్రీం పేరుతో నడుస్తున్న పార్లర్లను తనిఖీ చేసి నిర్వాహకుడు సయ్యద్ ముషరావుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.
ఈ దాడుల్లో రూ.5.44 లక్షల విలువైన యంత్రాలు, ఫ్రిజ్‌లు, ప్యాకింగ్ మెషీన్‌లు, చక్కెర, సిట్రిక్ యాసిడ్ వంటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను మెహిదీపట్నం పోలీసులకు అప్పగించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
