పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, భవిష్యత్తులో దాడులు పునరావృతం కాకుండా బలమైన హామీలు ఇస్తే యుద్ధం ముగించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ విషయాన్ని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో జరిగిన చర్చల్లో వెల్లడించారు.
ఇక మరోవైపు దౌత్య మార్గాల్లో సమస్య పరిష్కారానికి పిలుపునిచ్చిన యూరోపియన్ నాయకత్వం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించింది. అయితే అమెరికాతో అధికారిక చర్చలు జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
