భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ‘గ్యాప్ అప్’ ఓపెనింగ్ ఇచ్చిన మార్కెట్లు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. నిఫ్టీ 22,800 దాటగా, సెన్సెక్స్ కూడా 73,000 పైగా ట్రేడ్ అవుతూ బలమైన ర్యాలీ చూపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల (FIIs) కొనుగోళ్లు మార్కెట్‌కు ప్రధాన బలం అందించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లు భారీగా పెరగడంతో సూచీలు వేగంగా ఎగిశాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం, బడ్జెట్ అంచనాలు, స్థిరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు మార్కెట్‌కు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలాగే Q4 ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు కూడా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతున్నాయి