అమరావతి చట్టబద్ధత బిల్లుపై టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చకు అనుమతి కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే చర్చించాలని కోరగా, ఒక గంట తరువాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాలని సూచించారు.
ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లును కేంద్రం ఈరోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. హోం మంత్రి అమిత్ షా లేదా సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈరోజే లోక్‌సభలో ఆమోదం పొందే అవకాశాలు ఉండగా, రేపు రాజ్యసభలో కూడా ఆమోదం పొందవచ్చని సమాచారం.
