ఇరాన్ సుప్రీం లీడర్ మార్పు తర్వాత మొజ్తాబా ఖమేనీ కనిపించకపోవడంతో అనేక వదంతులు వ్యాపించాయి. ఆయన మరణించారని, లేదా రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ రష్యా రాయబారి అలెక్సీ డెడోవ్, మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు.
అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోయినా, భద్రతా కారణాల వల్లనే ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
