ఏపీ బార్ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 8 మంది సభ్యులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. కలిగినీడి చిదంబరం, బాలాజీ యలమంజుల, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని సహా పలువురు న్యాయవాదులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
