మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులకు నెల్లూరు జిల్లా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చెన్నైకు చెందిన సంస్థ డైరెక్టర్లు ఆగస్టిన్ జోసెఫ్, కామాక్షి రంగనాథన్, పుష్పం అప్పలనాయుడు దోషులుగా తేలారు.
2008లో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మనీ సర్కులేషన్ పేరుతో భారీ మోసం జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. సీఐడీ దర్యాప్తు అనంతరం 2016లో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, ఇప్పుడు కోర్టు తుది తీర్పు వెలువరించింది.
