భారత స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే ప్రభావం స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించగా, అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి.

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపులోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోవడంతో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడం, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరగడం, అమెరికా మార్కెట్లలో అనిశ్చితి వంటి అంతర్జాతీయ పరిణామాలు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి.