డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పరీక్షలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో నిర్వహిస్తాం. గ్యాడ్యుయేట్లకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,000 చొప్పున నెలవారీ ఆర్థిక సాయం అందిస్తాం.

5 శాతం ఉద్యోగాలు తమిళులకే కేటాయిస్తాం. క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్ స్కీమ్ అమలుచేసి క్రియేటర్ల హబ్‌గా తమిళనాడును తీర్దిదిద్దుతాం.

ఉపాధి కోరకునే యువతను ఉపాధి కల్పించే యువతగా తీర్దిదిద్దడం మా లక్ష్యం. స్థానికులకు ఉపాధి పథకం ప్రవేశపెడతాం.

క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్ స్కీమ్ అమలుచేసి క్రియేటర్ల హబ్‌గా తమిళనాడును తీర్దిదిద్దుతాం. రాష్ట్రవ్యాప్తంగా 500 క్రియేటివ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం’ అని విజయ్ వాగ్దానం చేశారు.

తమిళనాడులో ప్రత్నామ్నాయ శక్తి తమదేనని టీవీకే ప్రచారం సాగిస్తోంది. 234 మంది సభ్యుల తమిళ అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.