దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్–అమెరికా ఘర్షణలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు (2.22%) పడిపోయి 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 488.20 పాయింట్లు (2.14%) నష్టపోయి 22,331.40 వద్ద నిలిచింది.

ఈ పతనంతో మదుపర్ల సంపదలో సుమారు రూ. 9 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. PSU బ్యాంకులు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి.

ఇదే సమయంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.45కి పడిపోయి చరిత్రలో కనిష్ఠ స్థాయికి చేరింది.

మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసివేయబడతాయి.