ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రిటైర్‌మెంట్‌పై సందేహాలు పెరుగుతున్నాయి. బ్యూనస్ ఐరీస్‌లో జరిగిన మ్యాచ్‌లో గోల్, అసిస్ట్‌తో మెరిసిన మెస్సి మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడంతో, ఇది స్వదేశంలో అతని చివరి మ్యాచ్ అయ్యుండొచ్చనే చర్చ మొదలైంది.

ఇక ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అర్హత సాధించిన నేపథ్యంలో, మెస్సి ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జట్టు, కోచ్ తీసుకునే నిర్ణయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.