లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు తెరపడిందని ఆయన తెలిపారు. ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
సీఎం తన ఎక్స్ పోస్టులో, అమరావతి ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు ఇది న్యాయం జరిగినట్టేనన్నారు. గతంలో ఉన్న అనిశ్చితి తొలగిపోయి, ఇప్పుడు అమరావతి అభివృద్ధికి స్పష్టమైన దారి ఏర్పడిందని వెల్లడించారు.
స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా బిల్లుకు మద్దతు తెలిపిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
