చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాని మండలానికి చెందిన చంద్రమ్మ (35) అదృశ్యమైన రెండు రోజుల తర్వాత పలమనేరు అటవీ ప్రాంతంలో మృతదేహంగా లభ్యమైంది. నగదు లావాదేవీలే ఈ హత్యకు కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
